కేసీఆర్‌ను కలిసిన వరంగల్‌ నేతలు

ABN , First Publish Date - 2021-03-22T05:13:13+05:30 IST

కేసీఆర్‌ను కలిసిన వరంగల్‌ నేతలు

కేసీఆర్‌ను కలిసిన వరంగల్‌ నేతలు

హన్మకొండ టౌన్‌, మార్చి 21 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించిన సందర్భంగా వరంగల్‌ ఉమ్మడి జిల్లా నేతలు ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. పల్లా గెలుపునకు సహకరించిన నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. సీఎంను కలిసిన వారిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్‌, రాజయ్య, చల్లా ఽధర్మారెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.వాసుదేవరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవిందర్‌రావు తదితరులున్నారు.

Updated Date - 2021-03-22T05:13:13+05:30 IST