సైకిళ్లు, ఎడ్ల బండ్లు, రిక్షాలతో కాంగ్రెస్ భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2021-07-12T18:23:20+05:30 IST

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

సైకిళ్లు, ఎడ్ల బండ్లు, రిక్షాలతో కాంగ్రెస్  భారీ ర్యాలీ

వరంగల్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.  కాజీపేట నుంచి హన్మకొండ చౌరస్తా వరకు సైకిళ్లు, ఎడ్ల బండ్లు, రిక్షాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర  లీటర్కు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు ఉందన్నారు. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర 71రూపాయలు ఉంటే.. ఇప్పుడు అది 105 రూపాయలకు చేరిందని రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి అన్నారు. 


నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై టీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. 

Updated Date - 2021-07-12T18:23:20+05:30 IST