Friend సోదరుడికి యువతి ప్రేమ వల.. అసలు విషయం తెలిసి ఆత్మహత్య!

ABN , First Publish Date - 2021-08-20T18:28:16+05:30 IST

ప్రేమ పేరుతో యువకుడిని యువతి ట్రాప్‎లోకి దింపి మోసం చేసింది. బీటెక్ చదువుతున్న యువతి ప్రేమ పేరుతో స్నేహితురాలి సోదరుడికి వల వేసింది. ముగ్గురు వేర్వేరు యువతుల పేర్లతో యువకుడికి

Friend సోదరుడికి యువతి ప్రేమ వల.. అసలు విషయం తెలిసి ఆత్మహత్య!

వరంగల్ : ప్రేమ పేరుతో యువకుడిని యువతి ట్రాప్‎లోకి దింపి మోసం చేసింది. బీటెక్ చదువుతున్న యువతి ప్రేమ పేరుతో స్నేహితురాలి సోదరుడికి వల వేసింది. ముగ్గురు వేర్వేరు యువతుల పేర్లతో యువకుడికి ఫోన్ కాల్స్ చేసి తన మాయలోకి దింపుకుంది. దీంతో ఆ యువకుడు యువతితో చాలా దగ్గరగా ఫోన్లలో వాట్సాప్ చాటింగ్ దాకా వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత యువతి యువకుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. యువతి గురించి అసలు విషయం తెలుసుకున్న యువకుడు యువతిని నిలదీశాడు. 


దీంతో యువతి డబ్బులు ఇవ్వకపోతే చాటింగ్ బయటపెడతానని బెదిరించింది. యువకుడు తన భాధ ఎవరికి చెప్పుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. కుటుంబ సభ్యులు యువకుడిని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి కారణమైన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు సందీప్ స్వస్థలం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల కాగా.. యువతి వరంగల్ జిల్లాకు దుగ్గొండి మండలం లక్ష్మీపురానికి చెందిన కిలాడిగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-08-20T18:28:16+05:30 IST