ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉండాలి

ABN , First Publish Date - 2021-12-30T18:14:33+05:30 IST

ప్రజల సొమ్ముకు జవాబుదారిగా ఉండాలని మునిసిపల్‌ చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న అన్నారు. డోర్నకల్‌ మునిసిపల్‌ సర్వసభ్య సమావేశం చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న అధ్యక్షతన బుధవారం మునిసిపల్‌ కార్యాలయంలో జరిగింది.

ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉండాలి

డోర్నకల్‌, డిసెంబరు 29: ప్రజల సొమ్ముకు జవాబుదారిగా ఉండాలని మునిసిపల్‌ చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న అన్నారు. డోర్నకల్‌ మునిసిపల్‌ సర్వసభ్య సమావేశం చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న అధ్యక్షతన బుధవారం మునిసిపల్‌ కార్యాలయంలో జరిగింది. సమావే శానికి ముఖ్యఅతిథిగా డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్‌ నివారణ కోసం పాలకవర్గం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అలాగే కూరగాయల మార్కెట్‌ వద్ద వ్యాపారులు చెత్తను రోడ్డుపైనే వేస్తున్నార ని, దీనిని నివారించటానికి డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ-ప్రొక్యూర్మెంట్‌ ద్వారా పిలిచిన టెం డర్లకు గాను రూ.54వేలు చెల్లించినట్లు నివేదిక చదవగా.. ఏ పనుల కోసం టెండర్లు పిలిచారని ఎమ్మెల్యే ప్రశ్నించగా సమాధానం ఇవ్వటానికి తడబడ్డాడు. దీంతో ప్రజలు చెల్లించే పన్నులకు జవాబుదారితనం ఉండాలన్నారు.


అనంతరం రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులు జమ చేసినందుకుగాను మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సమావేశంలో వైస్‌చైర్మన్‌ కోటిలింగం, కౌన్సిలర్లు హేమచంద్రశేఖర్‌, బసిక అశోక్‌, బొడ అమల, జర్పుల వీరన్న, తేజావత్‌ సంధ్యారాణి, అంకెపాక అరుణ, బొరగళ్ల శరత్‌బాబు, కొత్త రాధిక, పోటు జనార్దన్‌, మోనికా జైన్‌, పర్వీన్‌ సుల్తానాలు పాల్గొన్నారు.


బిష్‌పను అభినందించిన ఎమ్మెల్యే ..

డోర్నకల్‌ బిష్‌పగా ఎన్నికైన కోడిరెక్క పద్మారావును ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అభినందించారు. బిషప్‌ కంపౌండ్‌లో చేయాల్సిన అభివృద్ధి పనులపై బిషప్‌ పలు సూచనలు చేశారు. అనంతరం ఇటీవల మృతిచెందిన రేషన్‌ డీలర్‌ నాయిని భాగ్యమ్మ, జర్పుల లక్ష్మణ్‌ కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. 

Updated Date - 2021-12-30T18:14:33+05:30 IST