బీజేపీ జాతీయ నాయకత్వంతో క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ భేటీ?

ABN , First Publish Date - 2021-10-28T08:52:27+05:30 IST

ప్రముఖ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇటీవల బీజేపీ జాతీయ ముఖ్యనేత ఒకరితో సమావేశమైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో...

బీజేపీ జాతీయ నాయకత్వంతో క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ భేటీ?

పార్టీలో చేరతారంటూ ప్రచారం

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇటీవల బీజేపీ జాతీయ ముఖ్యనేత ఒకరితో సమావేశమైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన బీజేపీలో చేరతారంటూ బుధవారం సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే లక్ష్మణ్‌ భేటీకి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని బీజేపీ రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. ఆయన పార్టీలో చేరనున్నట్లు జరిగిన ప్రచారం వాస్తవం కాకపోవచ్చని సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-10-28T08:52:27+05:30 IST