వీఆర్‌ఓలను జూనియర్ అసిస్టెంట్లుగా గుర్తించాలి
ABN , First Publish Date - 2021-01-12T08:57:55+05:30 IST
గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ)లను రెవెన్యూ శాఖలోనే జూనియర్ అసిస్టెంట్‌లుగా నియమించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం కోరింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని

మంత్రి ప్రశాంత్‌రెడ్డికి వీఆర్‌ఓల సంక్షేమ సంఘం వినతి
హైదరాబాద్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ)లను రెవెన్యూ శాఖలోనే జూనియర్ అసిస్టెంట్‌లుగా నియమించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం కోరింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గరికె ఉపేంద్రరావు, సుధాకరరావుల నేతృత్వంలో ప్రతినిధులు కలిసి వినతిపత్రాన్ని అందించారు. అర్హత కలిగినవారికి సీనియర్ అసిస్టెంట్లు/గిర్దావర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు.