ఆత్మప్రబోధానుసారం ఓటేయండి: దాసోజు

ABN , First Publish Date - 2021-03-14T07:24:59+05:30 IST

ఓటును అమ్ముకుంటే ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్లేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు.

ఆత్మప్రబోధానుసారం ఓటేయండి: దాసోజు

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఓటును అమ్ముకుంటే ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్లేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. వివేకం ఉన్నవారిగా లోతైన ఆలోచన చేయాలని, ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని పట్టభద్రులను ఆయన కోరారు. ప్రజాప్రతినిధులను సంతలో గొడ్లను కొన్నట్లుగా కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్‌.. పట్టభద్రుల ఓట్లనూ కొనుక్కునే దుర్మార్గానికి దిగారని, ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇచ్చి కొనుక్కునే ప్రయత్నం చేశారని ఆయన ధ్వజమెత్తారు. ప్రలోభానికి లోనై ఓటేస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కోల్పోతారని హితవు పలికారు. నిజాయతీ, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని ఓ ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-14T07:24:59+05:30 IST