స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉపన్యాస పోటీలు

ABN , First Publish Date - 2021-12-29T01:34:16+05:30 IST

స్వామి వివేకానంద 159వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వివేకానంద సందేశంపై వరంగల్ వివేక భారతి సొసైటీ ఆధ్వర్యంలో ..

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉపన్యాస పోటీలు

వరంగల్: స్వామి వివేకానంద 159వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వివేకానంద సందేశంపై వరంగల్ వివేక భారతి సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ప్రసంగ పోటీలను నిర్వహించన్నారు. ఈ పోటీలను జనవరి 2 నుంచి ఆన్ లైన్‌లో నిర్వహించనున్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు. ప్రథమ బహుమతి కింద రూ. 5 వేలు, రెండో బహుమతిగా రూ. 3 వేలు, మూడో బహుమతి కింద రూ.2 వేలు, రూ.516 ప్రదానం చేయనున్నారు. ఈ పోటీలు జూనియర్ (6 నుంచి 10 తరగతులు), సీనియర్ (ఇంటర్ ఆ పై తరగతులు) విభాగాల్లో వేర్వేరుగా ఉంటాయి. పోటీల్లో పాల్గొనాలనుకునే వాళ్లు డిసెంబర్ 31లోపు 9963272231 నెంబర్‌కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేయించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-12-29T01:34:16+05:30 IST