లక్ష యువగళ గీతార్చనకు అనుమతి: వీహెచ్‌పీ

ABN , First Publish Date - 2021-12-07T08:11:12+05:30 IST

ఈ నెల 14న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న లక్ష యువగళ గీతార్చన కార్యక్రమానికి డీజీపీ అనుమతి ఇచ్చారని విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) పేర్కొంది.

లక్ష యువగళ గీతార్చనకు అనుమతి: వీహెచ్‌పీ

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 14న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న లక్ష యువగళ గీతార్చన కార్యక్రమానికి డీజీపీ అనుమతి ఇచ్చారని విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) పేర్కొంది. వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు మూసాపేట రామరాజు, లక్ష యువ గళ గీత రచన కన్వీనర్‌ వెంకటేశ్వరరాజు, బజరంగ్‌ దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌ చందర్‌ తదితరులు సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. కాగా, ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్‌ అథారిటీ తొలుత అనుమతి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనున్న క్రిస్మస్‌ వేడుకల దృష్ట్యా దీపార్చనకు అనుమతి రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే క్రిస్మస్‌ వేడుకలు 18 నుంచి ప్రారంభమవుతాయని, తాము చేపట్టిన కార్యక్రమం 15 వరకే పూర్తవుతుందని స్పోర్ట్స్‌ అథారిటీకి వివరించామని సుభా్‌షచందర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2021-12-07T08:11:12+05:30 IST