గద్దెనెక్కాలని ఆశ పడిన మాజీ మంత్రి ఈటల

ABN , First Publish Date - 2021-10-07T06:18:18+05:30 IST

గద్దెనెక్కాలని ఆశ పడిన మాజీ మంత్రి ఈటల

గద్దెనెక్కాలని ఆశ పడిన మాజీ మంత్రి ఈటల
శ్రీరాములపల్లిలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

కమలాపూర్‌, అక్టోబరు 6 : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సీఎం కేసీఆర్‌ను గద్దెదించి.. తాను గద్దెనెక్కాలని ఆశపడ్డాడని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయి నపల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. కమలాపూర్‌ మండలంలోని గూనిపర్తి, శ్రీరాములపల్లి, గూడూరు, అంబాల గ్రామాలలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలతో కలిసి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములపల్లిలో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఈటలకు చాలా అవకాశాలు ఇస్తే ఈటల ఎదిగాడన్నారు. సీఎం పదవి తప్ప అన్ని పదవులు అనుభవించాడని, పార్టీ తనకు చేయనిది ఏమిటని ఆయన ప్రశ్నించారు. పెంచి పెద్ద చేసిన పార్టీని, తనకు అన్న లాంటి సీఎం కేసీఆర్‌కు వెన్ను పోటు పొడిచారన్నారు. ఐదేళ్లుగా సీఎం కేసీఆర్‌తో పడుతలేదని చెప్పిన ఈటల మంత్రివర్గంలో ఎలా కొనసాగాడన్నారు. ఈటల పార్టీలోకి రాకముందే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో స్థానిక పదవులు గెలిచామని, ఉద్యమం ఉధృతంగా చేశామన్నారు. గులాబీ జెండా ఆదరణతో రాష్ట్రమంతా తిరిగాడన్నారు. ఆశ పడడంలో తప్పులేదని, కానీ సందర్భం ఏమిటని ప్రశ్నించారు. సీఎంకేసీఆర్‌ తెలంగాణను సాధించి ముందుకు పోతున్నారన్నా రు. రాష్ట్రం వచ్చిన రెండు, మూడు నెలల్లోనే సీఎం కేసీఆర్‌ తెలంగాణకు కరెంట్‌ తీసుకొచ్చి రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. ఈటల ఎందుకు రాజీనామా చేశారో ఇంతవరకు స్పష్టంగా చెప్పడం లేదన్నారు. తాను నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం రాజీనామా చేశాడా? అని ప్రశ్నించారు. ఈటలకు నియోజకవర్గ ప్రజలు ఎందు కు ఓటు వేయాలి అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి ఈటల మాట్లాడటం లేదన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించబోతోందన్నారు. 

కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ పెరియాల రవీందర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంపత్‌రావు,వై్‌స చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, పొలాడి రామారావు, సర్పంచ్‌లు విజేందర్‌రెడ్డి, సాంబయ్య, రవీందర్‌రెడ్డి, ప్రదీ్‌పరెడ్డి, సత్యనారాయణరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-07T06:18:18+05:30 IST