మద్యం మత్తులో కూలీలపై బవుసాయి పేట గ్రామ సర్పంచ్ పారలతో దాడి

ABN , First Publish Date - 2021-06-21T18:33:46+05:30 IST

కోనరావుపేట మండలం బవుసాయి పేట గ్రామ సర్పంచ్ కందె గంగాధర్, మాజీ ఎంపీటీసీ చిగుర్లు దేవయ్య నిర్వాకం తాజాగా వెలుగు చూసింది

మద్యం మత్తులో కూలీలపై బవుసాయి పేట గ్రామ సర్పంచ్ పారలతో దాడి

రాజన్న సిరిసిల్ల: కోనరావుపేట మండలం బవుసాయి పేట గ్రామ సర్పంచ్ కందె గంగాధర్, మాజీ ఎంపీటీసీ చిగుర్లు దేవయ్య నిర్వాకం తాజాగా వెలుగు చూసింది. మద్యం మత్తులో కూలీపై పారలతో దాడికి పాల్పడ్డారు. దీంతో తమకు న్యాయం కావాలంటూ గ్రామ పంచాయతీ ముందు దళితులు బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ ఎంపీటీసీ దేవయ్య ఇంటిపై దళితులు దాడికి దిగారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.


Updated Date - 2021-06-21T18:33:46+05:30 IST