టీఆర్ఎస్ ఎన్నో హామీలిచ్చి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఒరగబెట్టింది శూన్యం: రాములమ్మ

ABN , First Publish Date - 2021-10-21T15:09:39+05:30 IST

న్నో హామీలిచ్చి 2018లో ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ వెళ్లి ఒరగబెట్టింది మాత్రం పెద్దగా ఏమీ లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు.

టీఆర్ఎస్ ఎన్నో హామీలిచ్చి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఒరగబెట్టింది శూన్యం: రాములమ్మ

హైదరాబాద్: ఎన్నో హామీలిచ్చి 2018లో ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ వెళ్లి ఒరగబెట్టింది మాత్రం పెద్దగా ఏమీ లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ఇంద్రభవనం లాంటి ప్రగతి భవన్‌ను మాత్రం సంవత్సర కాలంలోనే సీఎం కేసీఆర్ నిర్మించుకున్నారని కానీ ఇన్నేళ్లవుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను మాత్రం పెద్దగా నిర్మించలేకపోయారని విమర్శించారు. పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులకు కేటాయించక అవి కొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయన్నారు.




‘‘రాష్ట్రంలో ఉన్న పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని 2014 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఆ ఎన్నికల్లో గెలిచాక... నిధులు సమకూరుస్తున్నామని కాలం వెళ్ళబుచ్చుకుంటూ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి... 2019 ఏప్రిల్‌ నాటికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని... గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పేదల కోసం లక్ష ఇళ్లు కడ్తున్నామని... త్వరగా పూర్తి చేసేందుకు రాత్రిపూట కూడా పనులు కొనసాగిస్తున్నామని... ఇక లబ్ధిదారులకు జాగా ఉంటే రూ.5 లక్షలు ఇస్తమని... వారు కూడా అక్కడే ఇల్లు కట్టుకోవచ్చని ప్రగల్బాలు పలికి ఏడేండ్లవుతున్నా... ఇప్పటిదాకా ఇళ్లు పూర్తిగా నిర్మించి పంపిణీ చేసింది కేవలం 13,726 మందికి మాత్రమే. ఇంకా 1,88,343 ఇండ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయంటే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలపై ఉన్న శ్రద్ద ఇట్టే అర్ధమవుతుంది. 


వందల కోట్ల ప్రజల ధనంతో ఇంద్రభవనం లాంటి ప్రగతి భవన్‌ను సంవత్సర కాలంలోనే నిర్మించుకున్న సీఎం కేసీఆర్... డబుల్ బెడ్ రూం ఇళ్లకు సకాలంలో ఫండ్స్ రిలీజ్ చేయకుండా... హడ్కో నుంచి అప్పులు తీసుకుని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి... ఇళ్లు లేని వారి కోసం కేంద్రం ఇచ్చిన ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ డబుల్ ఇళ్లకు మళ్లించారు. 2.91 లక్షల ఇళ్లకు రూ.19,126 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా... ఇప్పటిదాకా రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి, ఇంకా మిగిలిన పనులు పూర్తి చెయ్యడానికి మరో రూ.9 వేల కోట్లకు పైగా అవసరం ఉన్నా... ఈ ఏడాది బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.11 వేల కోట్ల కేటాయింపులు చూపినా... ఈ మొత్తాన్ని బ్యాంకులు, రుణ సంస్థల నుంచి అప్పులుగా తీసుకోనున్నట్లు ఆఫీసర్లు చెప్పడం గమనార్హం. కాగా... కొన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికులే డబుల్ ఇళ్లలో చేరిపోతున్నారు. కొన్ని చోట్ల డబుల్ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతుండగా... మరికొన్ని చోట్ల లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకముందే బీటలు వారుతున్న పరిస్థితి నెలకొంది. ఎలక్షన్లు వచ్చినప్పుడే డబుల్  బెడ్రూం ఇళ్ల గురించి మాట్లాడే రాష్ట్ర సర్కార్.... ఎన్నికల తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. పేదింటి కల అయిన సొంతింటి ఇండ్ల నిర్మాణానికై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ఆవాస్ యోజన పథకం రాష్ట్రంలో అమలు చేయకుండా రాష్ట్ర సర్కార్ ప్రజలను మోసం చేస్తోంది’’ అని విజయశాంతి పేర్కొన్నారు. 



Updated Date - 2021-10-21T15:09:39+05:30 IST