రాములమ్మ యోగా ఆసనాలు

ABN , First Publish Date - 2021-06-21T21:28:18+05:30 IST

బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాములమ్మ యోగా ఆసనాలు

హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ నేతలు యోగా ఆసనాలు చేశారు. విజయశాంతి చేసిన యోగా ఆసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యాయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద యోగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 3వేల మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని సోల్స్ టైస్ టు టైమ్స్ స్క్వేర్గా అభివర్ణించారు. ప్రముఖ యోగా నిపుణులు ధారా నటాలితోపాటు వివిధ భారతీయ సంఘాలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిందని, ఇండియాలో పుట్టిన యోగా గ్లోబల్ హెరిటేజ్‌గా మారిందన్నారు. ఆరోగ్యానికి, సంక్షేమానికి ప్రకృతితో మమేకమై జీవించడానికి యోగా ఎంతో తోడ్పడుతుందని అన్నారు.

Updated Date - 2021-06-21T21:28:18+05:30 IST