హిందూధర్మం విషయంలో గోముఖవ్యాఘ్రంలా కేసీఆర్ :విజయశాంతి

ABN , First Publish Date - 2021-07-08T22:31:31+05:30 IST

సీఎం కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణలో గోవుల అక్రమ రవాణా

హిందూధర్మం విషయంలో గోముఖవ్యాఘ్రంలా కేసీఆర్ :విజయశాంతి

హైదరాబాద్:  సీఎం కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, చట్టాలకు అనుగుణంగా గోవులను రక్షిస్తున్న వారిపై దాడులు జరుగుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. నిఖార్సైన హిందువునంటూ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పుకుంటారని, అలాంటిది హిందూ ధర్మానికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో సీఎం గోముఖ వ్యాఘ్రంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ, గోవధ నిషేధ చట్టానికి శఠగోపం పెడుతున్నారని విజయశాంతి ఆరోపించారు. బక్రీద్ రోజున గోవధ చేస్తామంటూ ఎంఐఎం నేతలు డీజీపీకి వినతిపత్రం ఇస్తే చూస్తూ ఊరుకున్నారని, ఈ లేఖ ఇచ్చిన ఎంఐఎం నేతలను వెంటనే పదవుల నుంచి తప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. గోవధ విషయంలో జరుగుతున్నపరిణామాలపై చర్యలు తీసుకోవాలని, గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సర్కారుదేనని ఆమె స్పష్టం చేశారు. అక్రమంగా గోవుల రవాణాను నిరోధించి, గోవధ జరగకుండా అడ్డుకుని రక్షించడానికి రాజ్యాంగంలోని జంతు సంరక్షణ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో పలు తీర్పులు ఇచ్చిందని ఈ సందర్భంగా విజయశాంతి గుర్తు చేశారు.


Updated Date - 2021-07-08T22:31:31+05:30 IST