విజయ పాల సేకరణ ధరను లీటర్‌కు రూపాయి పెంపు
ABN , First Publish Date - 2021-02-10T21:40:30+05:30 IST
పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకారం సమాఖ్య(విజయ తెలంగాణ డెయిరీ) రైతులకు చెల్లించే పాల
హైదరాబాద్: పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకారం సమాఖ్య(విజయ తెలంగాణ డెయిరీ) రైతులకు చెల్లించే పాల సేకరణ ధరను ఒక రూపాయి చొప్పున పాడి రైతులకు పెంచాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వం ఇస్తున్న లీటర్ నాలుఉ రూపాయల ప్రోత్సాహకానికి అదనం. ఈ నిర్ణయం వల్ల సంవత్సరానికి లక్ష మందికి పైగా విజయా తెలంగాణ డెయిరీ పాడి రైతులు ప్రయోజనం పొందుతారని సంస్థ ఛైర్మన్ లోకా భూమారెడ్డి తెలిపారు.
విజయ తెలంగాణ డెయిరీ ద్వారా అదనంగా సంవత్సరానికి కనీసం 12 కోట్ల రూపాయల పాల బిల్లుల రూపంలో రైతులకు చెల్లిస్తామన్నారు. లీటర్‌కు 4 చొప్పున ప్రోత్సాహక బకాయిలు ఇటీవల పూర్తిగా చెల్లించిన నేపధ్యంలో ప్రస్తుతం పెంచుతున్న లీటర్‌కు ఒక రూపాయితో ఇతర ప్రైవేటు , కో ఆపరేటివ్ డెయిరీలతో పోలిస్తే విజయ తెలంగాణ డెయిరీ అందరి కంటే ఎక్కువగా పాల ధరను చెల్లిస్తుందని అన్నారు.