గవర్నర్‌కు ఉపరాష్ట్రపతి పరామర్శ

ABN , First Publish Date - 2021-09-02T09:27:50+05:30 IST

మాతృ వియోగంతో బాధపడుతున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం పరామర్శించారు...

గవర్నర్‌కు ఉపరాష్ట్రపతి పరామర్శ

హైదరాబాద్‌, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): మాతృ వియోగంతో బాధపడుతున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం పరామర్శించారు. గవర్నర్‌ మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. వెంకయ్యనాయుడు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించి, సానుభూతిని తెలిపారు. ఇటీవల సర్జరీ చేసుకుని కోలుకుంటున్న మిజోరం గవర్నర్‌ కె.హరిబాబును కూడా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. 

Updated Date - 2021-09-02T09:27:50+05:30 IST