తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాలి
ABN , First Publish Date - 2021-10-25T08:32:59+05:30 IST
‘‘అందరికీ అందుబాటులోకి వచ్చేలా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాలి. ఉన్న పదాలను సమర్థవంతంగా వాడుకోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరం’’ అని ఉపరాష్ట్రపతి

పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
న్యూఢిల్లీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘అందరికీ అందుబాటులోకి వచ్చేలా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాలి. ఉన్న పదాలను సమర్థవంతంగా వాడుకోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరం’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ రూపొందించిన 100వ పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆన్‌లైన్ ద్వారా ఆవిష్కరించారు.