పింగళి వెంకయ్యకు కూడా వారోత్సవాలు జరపాలి: వీహెచ్

ABN , First Publish Date - 2021-01-13T19:03:33+05:30 IST

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వావాలు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్

పింగళి వెంకయ్యకు కూడా వారోత్సవాలు జరపాలి: వీహెచ్

హైదరాబాద్: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వావాలు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ప్రధాని పీవీ. నర్సింహ రావుకు చేసినట్టే పింగళి వెంకయ్యకు కూడా వారోత్సవాలు జరపాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా దీని గురించి ఆలోచించాలని కోరారు. పీవీకి గౌరవం ఇచ్చినట్టే జాతీయ జెండా రూపకర్తకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పింగళి వెంకయ్య తెలుగు వాడు అని, ఈ జాతికి చాటాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

Updated Date - 2021-01-13T19:03:33+05:30 IST