సోనియాను కలిశాకే కొత్త, పాత కమిటీ గురించి మాట్లాడతా: వీహెచ్

ABN , First Publish Date - 2021-07-24T19:46:31+05:30 IST

తన ఆరోగ్యం విషయంలో సోనియాగాంధీ పాటు ఇతర నాయకులూ అందరూ తనను పరామర్శించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు.

సోనియాను కలిశాకే కొత్త, పాత కమిటీ గురించి మాట్లాడతా: వీహెచ్

హైదరాబాద్: తన ఆరోగ్యం విషయంలో సోనియాగాంధీ పాటు ఇతర నాయకులూ అందరూ తనను పరామర్శించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. నేడు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది హాస్పిటల్‌కి నన్ను కలవడానికి వచ్చారు. అందరికీ కృతజ్ఞతలు. బడుగు బలహీన వర్గాల వాళ్లకి నా సేవలు అవసరమని మా సోనియాగాంధీ తెలిపారు. రాజకీయాల్లోకి సేవ చేయాలని వచ్చాను. అంతే తప్ప డబ్బులు సంపాదించడానికి రాలేదు. సోనియా గాంధీ నాతో మాట్లాడటం వల్ల నాకు మరింత దైర్యం పెరిగింది. నా మిగతా జీవితం అంతా బడుగు బలహిన వర్గాలకి సేవ చేస్తాను. ఎక్కడ పేదవారికి ఆపద ఉన్నా ఆదుకునే పవన్ కళ్యాణ్ నా అరోగ్య విషయంలో నాకు లెటర్ రాశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. నేను ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉంటాను. మా నాయకురాలిని కలిసిన తరువాత కొత్త కమిటీ, పాత కమిటి గురించి మాట్లాడతాను. అప్పటివరకూ ఏమీ మాట్లాడను’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2021-07-24T19:46:31+05:30 IST