వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-12-28T12:20:58+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని మొక్కులు

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్‌లో స్వామివారిని నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజ తదితర ఆర్జితసేవల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. సోమవారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లుచేశారు.

Updated Date - 2021-12-28T12:20:58+05:30 IST