నకిలీ పాస్‌లతో బయటకు వస్తే వాహనాలు సీజ్‌

ABN , First Publish Date - 2021-05-21T19:01:12+05:30 IST

బౌద్ధనగర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో నకిలీ పాస్‌లతో బయటకు వస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ హెచ్చరించారు.

నకిలీ పాస్‌లతో బయటకు వస్తే వాహనాలు సీజ్‌

బౌద్ధనగర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో నకిలీ పాస్‌లతో బయటకు వస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ హెచ్చరించారు. గురువారం సీతాఫల్‌మండి, వారాసిగూడ తదితర ప్రాంతాల్లో గోపాలపురం డివిజన్‌ ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నరే్‌షతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారాసిగూడ చౌరస్తాలో ఆయన స్వయంగా పలు వాహనాలను ఆపి పత్రాలు, గుర్తింపు కార్డు, పాస్‌లను పరిశీలించారు. అనంతరం వారాసిగూడ, బౌద్ధనగర్‌ వీధుల్లో రెండుగంటలపాటు పర్యటించారు. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్నవారిపై కేసులు నమోదు చేశారు. గల్లీల్లో ఎవరైనా షాపులు తెరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 


ఫ చిలకలగూడలో గోపాలపురం ట్రాఫిక్‌ ఎస్‌ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నకిలీపా్‌సలతో తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. పది నకిలీ పాస్‌లున్న వాహనాలను సీజ్‌ చేశామని ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. చిలకలగూడ మునిసిపల్‌ గ్రౌండ్‌ వద్ద అడ్మిన్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. వంద వాహనాలపై కేసులు నమోదు చేసి, 25 వాహనాలను సీజ్‌ చేశామని, ఐదు నకిలీ పాస్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఫ తిరుమలగిరి: తిరుమలగిరి చౌరస్తాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కేసు నమోదు చేసి వారి వాహనాలను సీజ్‌ చేశామని ఇన్‌స్పెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-05-21T19:01:12+05:30 IST