ఇక ఆన్‌లైన్‌లో వాహన ఫ్యాన్సీ నంబర్లు

ABN , First Publish Date - 2021-02-05T07:39:49+05:30 IST

వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు ఇక ఆన్‌లైన్‌ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఈమేరకు రవాణా శాఖ రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు గురువారం అంతర్గత ఉత్తర్వులు జారీ...

ఇక ఆన్‌లైన్‌లో వాహన ఫ్యాన్సీ నంబర్లు

  • నేటి నుంచి రాష్ట్రంలో అమలు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు ఇక ఆన్‌లైన్‌ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఈమేరకు రవాణా శాఖ రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు గురువారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. వాహనదారులు ఇకపై రవాణా శాఖ వెబ్‌సైట్‌లో ఫ్యాన్సీ నంబర్‌ను ఎంపిక చేసుకుని రిజర్వ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డబ్బును కూడా ఆన్‌లైన్‌లోనే బదిలీ చేయాలి. ఆన్‌లైన్‌ విధానాన్ని ఇప్పటికే హైదరాబాద్‌ జిల్లాలోని ఐదు ఆర్టీఏ కార్యాలయాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దీన్ని రాష్ట్రంలోని మిగతా 49 ఆర్టీఏ, యూనిట్‌ కార్యాలయాలకు శుక్రవారం నుంచి విస్తరించనున్నారు. ప్రస్తుతం వాహనదారులు తమకు కావాల్సిన ఫ్యాన్సీ నంబర్‌ను ఎంపిక చేసుకుని, ఆ నంబర్‌కు ఉన్న ఫీజును డీడీ రూపంలో చెల్లించే విధానం అమల్లో ఉంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ నంబర్‌కు ఒకే దరఖాస్తుదారుడు ఉంటే ఆ వాహనదారుడికే నంబరును కేటాయించేవారు. ఇదే నంబర్‌కు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీదారులుంటే వారు సీల్డ్‌ కవర్‌లో మరింత సొమ్మును కోట్‌ చేయాల్సి ఉండేది. ఇందులో ఎవరు ఎక్కువ కోట్‌ చేస్తే వారికి నంబర్‌ను అధికారులు అలాట్‌ చేసేవారు. ఇప్పుడు ఈ విధానమంతా ఆన్‌లైన్‌లో కొనసాగుతుంది. అంటే తమకు కావాల్సిన నంబర్‌ను రవాణా శాఖ వెబ్‌సైట్‌లో ఎంచుకోవచ్చు.


Updated Date - 2021-02-05T07:39:49+05:30 IST