శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
ABN , First Publish Date - 2021-12-31T19:33:15+05:30 IST
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ హెచ్చరించారు.

వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్
వర్ధన్నపేట, డిసెంబరు 30 : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ హెచ్చరించారు. గురువారం పట్టణంలో డివిజన్ పోలీసులతో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. పోలీసులకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని, గంజాయి విక్రయిస్తే తరలించిన చర్య లు తీసుకుంటామన్నారు. సీఐ సదన్‌కుమార్, ఎస్సైలు రామారావు, వంశీకృష్ణ, బండారి రాజు, డివిజన్ పోలీసులు పాల్గొన్నారు.