ఘనంగా వరలక్ష్మి వ్రతాలు

ABN , First Publish Date - 2021-08-21T05:11:18+05:30 IST

ఘనంగా వరలక్ష్మి వ్రతాలు

ఘనంగా వరలక్ష్మి వ్రతాలు
సంతోషిమాత ఆలయంలో పూజలు...

వరంగల్‌ కల్చరల్‌, ఆగస్టు 20: పవిత్ర శ్రావణమాసం రెండో శుక్రవారం  మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు. ఇంటి వద్ద వ్రతాలను నిర్వహించుకొని ఆలయాలకు తరలివెళ్లి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రసిద్ధ భద్రకాళి ఆలయంతో పాటు హంటర్‌ రోడ్డులోని శ్రీ సంతోషిమాత ఆలయానికి ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఇష్టదైవాన్ని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు ఒడి బియ్యం, నూతన వస్త్రాలను సమర్పించారు. ముత్తయిదువులకు వాయనాలను అందించారు. 

వరలక్ష్మి వ్రతాలకు పెద్ద పేరున్న రాజేశ్వరీ ఆలయంలో సామూహిక వ్రతాలను నిషేధించడంతో భక్తులు గుంపులు గుంపులుగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ చైర్మన్‌ వద్దిరాజు వెంకటేశ్వర్‌రావు తెలిపారు. హనుమకొండలోని పద్మాక్షి ఆలయంలో అర్చకులు నాగిళ్ళ శర్మ, వేద పం డితులు నాగిళ్ళ షణ్ముఖ అనంత పద్మనాభ అవధాని ఆధ్వర్యంలో శత కమలార్చన సహిత సువర్ణ పుష్పార్చనను శ్రీ సూక్తవిధానంతో నిర్వహించారు. జనగామ జిల్లా కలెక్టర్‌ ని ఖిల ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. లష్కర్‌బజార్‌లోని సంతోషిమాత, ములుగురోడ్డు, రామన్నపేటలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.Updated Date - 2021-08-21T05:11:18+05:30 IST