దంపతుల హత్యకు పుట్ట మధు దంపతులే సుపారీ ఇచ్చారు : కిషన్ రావు
ABN , First Publish Date - 2021-05-09T00:15:42+05:30 IST
హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు

మంథని : హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వామన రావు హత్యకు పుట్ట మధు దంపతులే సుపారీ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వామనరావు దంపతులు వేస్తున్న కేసులకు భయపడే వారిద్దర్ని అతి కిరాతకంగా హత్య చేయించారని ఆరోపించారు. పుట్ట మధు దంపతులు పరోక్షంగా పాల్గొని హత్య చేయించారని మండిపడ్డారు. తాను దుఃఖంలో ఉన్న సమయంలో రామగిరి ఎస్సై కంప్లైంట్ రాయించుకున్నారని, కేసులో ఎవరెవరు ఉన్నారో వారందరికీ శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హత్యలో పుట్ట మధుతో పాటు కమాన్‌పూర్ మార్కెట్ చైర్మన్ సత్యానారాయణ భాగస్వామ్యం కూడా ఉందని వామనరావు తండ్రి కిషన్ రావు ఆరోపించారు.