18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ఇలా..

ABN , First Publish Date - 2021-04-26T13:01:12+05:30 IST

పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయనున్న

18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ఇలా..

హైదరాబాద్‌ సిటీ : పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయనున్న నేపథ్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం మూడు మార్గాలలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మొదటి మార్గం.. కొవిన్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌, ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. రెండోది వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు వెళ్లి నేరుగా తమ పేర్లను ఏదైనా గుర్తింపు కార్డు చూపించి నమోదు చేసుకోవచ్చు. మూడోది స్థానిక అధికారుల ద్వారా నమోదు చేసుకోవడం.

  • www.cowin.gov.in లేదా కొవిన్‌, ఆరోగ్య సేతు యాప్‌ల ద్వారా తమ మొబైల్‌ నంబర్‌ నుంచి పేర్లు నమోదు చేసుకోవచ్చు. 
  • వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ నమోదు చేయగానే పేజీ ఓపెన్‌ అవుతుంది. దానిలో పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు గుర్తింపు కార్డులో ఉన్నట్లు నమోదు చేయాలి. ఏ గుర్తింపు కార్డులో ఉన్నట్లు వివరాలు నమోదు చేశారో దాన్ని అప్‌లోడ్‌ చేయాలి.
  • తరువాత వ్యాక్సినేషన్‌ కేంద్రం ఎంచుకోవాలి. అది ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రం అయినా కావచ్చు. ఆస్పత్రి అయితే పేరు నమోదు చేసిన వెంటనే వివరాలు వస్తాయి. మీకు వివరాలు తెలియకపోతే పిన్‌కోడ్‌ను బట్టి కూడా మీకు దగ్గరలోని సెంటర్‌ ఎంచుకోవచ్చు.
  • సెంటర్‌ను ఎంచుకున్న తరువాత స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. 
  • అన్నీ పూర్తయిన తర్వాత మీ అపాయింట్‌మెంట్‌ను నిర్ధారిస్తూ ఓ సందేశం వస్తుంది. దానితోపాటు మీరు ఏదైతే గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేశారో ఆ వివరాలతో వ్యాక్సినేషన్‌ కేంద్రానికి మీరు ఎంచుకున్న తేదీ, సమయానికి వెళ్లాలి. 
  • మీరు ఎంచుకున్న తేదీ, సమయానికి వెళ్లకపోతే రీ షెడ్యూల్‌ చేసుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2021-04-26T13:01:12+05:30 IST