వ్యాక్సిన్‌ ఒక్కటే కరోనాకు సమాధానం: గవర్నర్‌

ABN , First Publish Date - 2021-10-08T00:45:47+05:30 IST

వ్యాక్సిన్‌ ఒక్కటే కరోనాకు సమాధానమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గురువారం ఆమె నల్లగొండ జిల్లా కేంద్రంలో

వ్యాక్సిన్‌ ఒక్కటే కరోనాకు సమాధానం: గవర్నర్‌

నల్లగొండ: వ్యాక్సిన్‌ ఒక్కటే కరోనాకు సమాధానమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గురువారం ఆమె నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని, పేదలకు అందుబాటులో కనీస రుసుముతో నాణ్యమైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లను కోరారు. తాను గైనకాలజిస్ట్‌గా, తన భర్త నెఫ్రాలజిస్ట్‌గా వైద్య సేవలందించామని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యం కోసం ముందే జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చన్నారు. తప్పనిసరిగా మాస్క్‌లు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను తమిళిసై కోరారు.

Updated Date - 2021-10-08T00:45:47+05:30 IST