ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు టీకా

ABN , First Publish Date - 2021-05-30T08:46:26+05:30 IST

సూపర్‌ స్ర్పెడర్‌ కేటగిరిలోకి వచ్చే డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని ఆర్టీసీ శనివారం ప్రారంభించింది.

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు టీకా

వివిధ జిల్లాల్లో శనివారం 2200 మందికి వ్యాక్సిన్‌

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): సూపర్‌ స్ర్పెడర్‌ కేటగిరిలోకి వచ్చే డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని ఆర్టీసీ శనివారం ప్రారంభించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆది, సోమవారం కూడా కూడా వారికి టీకాలు వేయనున్నారు. వాస్తవానికి ఆర్టీసీ సిబ్బందికి ఆదివారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుందని, మూడు రోజుల పాటు కొనసాగుతుందని ఆర్థిక శాఖ మంత్రి, టీఎంయూ మాజీ గౌరవాధ్యక్షుడు టి.హరీశ్‌ రావు శనివారం ప్రకటించారు. అయితే ఆర్టీసీ అధికారులు శనివారం నుంచే టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట హైదరాబాద్‌లోని హెసీయూ డిపోలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 12 గంటల నుంచి ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, రాజేంద్రనగర్‌లలో టీకాలు వేయడం మొదలుపెట్టారు. జిల్లాల్లోని డిపోల పరిధిలో గల బస్టాండ్లలోనూ టీకాలు వేశారు. శనివారం మొత్తం 2,200 మంది డ్రైవర్లు, కండక్టర్లకు టీకాలు వేశామని అధికారులు తెలిపారు. మిగతా వారికి ఆది, సోమవారాల్లో వేస్తామని చెప్పారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకే టీకాలు వేస్తారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్‌ సూచించారు.

Updated Date - 2021-05-30T08:46:26+05:30 IST