హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్‌కు తగ్గిన ఆసక్తి

ABN , First Publish Date - 2021-05-30T14:02:58+05:30 IST

కోవాగ్జిన్‌ రెండో డోసు తీసుకునేందుకు వస్తున్న వారి

హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్‌కు తగ్గిన ఆసక్తి

హైదరాబాద్ సిటీ/జోన్‌ బృందం : కోవాగ్జిన్‌ రెండో డోసు తీసుకునేందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నది. మాదన్నపేట, జాంబాగ్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో శనివారం వాక్సినేషన్‌ తీసుకునేందుకు ఒక్కరూ రాలేదు. శాలివాహననగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 23 మందికి, గడ్డిఅన్నారం ఆరోగ్య కేంద్రంలో 17, మలక్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 11మందికి, మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో 20 మందికి టీకా వేశారు. బాలాపూర్‌ కేంద్రంలో 75మందికి, వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 170 మందికి, మన్సూరాబాద్‌ ఆరోగ్య కేంద్రంలో 65 మం దికి టీకాలు వేసినట్టు వైద్యులు తెలిపారు.

Updated Date - 2021-05-30T14:02:58+05:30 IST