వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

ABN , First Publish Date - 2021-05-02T05:55:09+05:30 IST

కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు టీకా ఎంతో దోహదపడుతుందని అంటున్నారు వ్యాక్సినేషన్‌ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ కోడూరి మమతాదేవి. మహమ్మారి రాకుండా ముందస్తు జాగ్రత్తల్లో ఇది అత్యంత ప్రధానమని అంటున్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఉన్న అనుమానాలను ఆమె నివృత్తి చేశారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా నిర్భయంగా టీకా వేయించుకోవాలని సూచించారు.

వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

(ఆంధ్రజ్యోతి, భూపాల‌ప‌ల్లి)

కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు టీకా ఎంతో దోహదపడుతుందని అంటున్నారు వ్యాక్సినేషన్‌ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ కోడూరి మమతాదేవి. మహమ్మారి రాకుండా ముందస్తు జాగ్రత్తల్లో ఇది అత్యంత ప్రధానమని అంటున్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఉన్న అనుమానాలను ఆమె నివృత్తి చేశారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా నిర్భయంగా టీకా వేయించుకోవాలని సూచించారు. 

ఎంత ఎక్కవ మొత్తంలో వ్యాక్సినేషన్‌ అయితే అదే స్థాయిలో కరోనాను కట్టడి చేయ్యొచ్చు. మొదటి డోస్‌ వేసుకున్న తర్వాత కరోనా పాజిటివ్‌ వచ్చిన 28 రోజుల తరువాత రెండో డోస్‌ వేసుకోవచ్చని అంటున్నారు భూపాలపల్లి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ కోడూరి మమత. వ్యాక్సిన్‌పై అపోహలు నమ్మొద్దు అంటున్న డాక్టర్‌ మమతతో ఆంరఽధజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ.. 

ప్రశ్న: వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో స్పందన ఎలా ఉంది?

జవాబు : వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో చాలా వరకు అవగాహన వచ్చింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో టీకా వేసుకోవాలని స్వచ్ఛందంగా కేంద్రాలకు వస్తున్నారు. 

ప్ర : మొదటి డోస్‌ తీసుకున్న తర్వాత రెండో డోస్‌ ఎప్పుడు వేసుకోవాలి?

జ : మొదటి డోస్‌కు రెండో డోస్‌కు మధ్య నాలుగు వారాల గడువు ఉండాలి. కోవాగ్జిన్‌ లేదా కోవిషీల్డ్‌లో ఏ వ్యాక్సిన్‌ వేసుకున్నా 28 రోజుల తర్వాత 29వ రోజున రెండో డోస్‌ తీసుకోవచ్చు.

ప్ర : రెండో డోస్‌ ఆలస్యమైతే ఏమైనా ప్రమాదమా .?

జ : ఎలాంటి ప్రమాదం లేదు. రెండో డోస్‌ 29వ రోజు తీసుకునేందుకు పరిస్థితులు అనుకూలించపోయినా ఏదైనా కారణం చేత సెకండ్‌ డోస్‌ వేసుకోకపోయినప్పటికీ ప్రమాదమేమీ లేదు. కోవాగ్జిన్‌ లేదా కోవిషిల్డ్‌లో ఏదైనా 29వ రోజుల నుంచి 42 రోజుల్లో ఎప్పుడైనా రెండో డోస్‌ వేసుకోవచ్చు.

ప్ర : మొదటి డోస్‌లో కోవాగ్జిన్‌ తీసుకొని.. సెకండ్‌ డోస్‌లో కోవిషీల్డ్‌ తీసుకోవచ్చా ?

జ : లేదు. మొదటి డోస్‌లో ఏ రకం టీకా తీసుకున్నారో రెండో డోస్‌లోనూ అదే  తీసుకోవాలి. ఉదాహరణకు మొదటి డోస్‌ కోవాగ్జిన్‌ తీసుకుంటే.. రెండో డోస్‌ కూడా అదే తీసుకోవాలి. 

ప్ర  : ఎలాంటి వారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దు ?

జ  : గర్భవతులు, బాలింతలు, బ్లీడింగ్‌ డిజార్డర్‌ ఉన్నవారు, ఇంతకు ముందు డ్రగ్స్‌ అలర్జీ ఉన్నవారు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో మంచం పట్టిన వారు వ్యాక్సిన్‌ వేసుకోవద్దు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికే టీకా వేస్తున్నాం. వీరిలో చాలా మందికి బీపీ, షుగర్‌, థైరాయిడ్‌ లాంటివి ఉంటాయి. ఇలాంటి వారు నిర్భయంగా టీకా వేసుకోవచ్చు. 

ప్ర  : వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జ  : మొదటి డోస్‌ వేసుకున్న తర్వాత 40 నుంచి 45 శాతం వరకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెండో డోస్‌ తీసుకున్న తర్వాత రెండు వారాలకు పూర్తి స్థాయిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ టైమ్‌లో ఒకవేళా కొవిడ్‌ వచ్చినా పెద్దగా ప్రమాదకరంగా ఉండదు. అయినప్పటికీ భౌతికదూరం పాటించాలి. మాస్కు తప్పనిసరిగా వాడుతూ... చేతులు తరుచూ శుభ్రపర్చుకుంటూ ఉండాలి.

ప్ర : మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత కరోనా పాజిటివ్‌ వస్తే సెకండ్‌ డోస్‌ ఎప్పుడు తీసుకోవాలి ?

జ : మొదటి డోస్‌ తీసుకున్న తర్వాత పాజిటివ్‌ వచ్చిన తేదీ నుంచి 28 రోజుల తర్వాత సెకండ్‌ డోస్‌ తీసుకోవాలి.

ప్ర : రెండో డోస్‌ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్‌ వస్తే మళ్లీ టీకా వేసుకోవాలా ?

జ :  అవసరం లేదు. రెండు డోసుల తర్వాత 15రోజుల్లో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 10 నెలల వరకు రక్షణ కల్పిస్తుంది. ఒకవేళా కరోనా పాజిటివ్‌ వచ్చినా పెద్దగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉండదు.

ప్ర : టీకాలపై అపోహలు ఉన్నాయి కదా..?

జ : టీకాలపై కొంత అపోహలు ఉన్నాయనేది వాస్తవమే. అయితే ఇప్పటి వరకు భూపాలపల్లి జిల్లాలో 75వేల పైగా వ్యాక్సిన్‌ వేశాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. టీకా వేసిన చోట నొప్పి ఉంటుంది. కొంచెం జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. జ్వరం రాగానే గాబారా పడొద్దు. ఏ టీకా వేసుకున్నా ఇలాంటివి రావటం సహజమే. జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే పారాసిటమల్‌ వేసుకుంటే సరిపోతుంది. 

ప్ర : 18ఏళ్లు నిండిన వారికి ఎప్పటి నుంచి వ్యాక్సిన్‌ ఇస్తారు?

జ : ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి గైడ్‌లైన్స్‌ రాలేదు. వచ్చే ఆదేశాలకు అనుగుణంగా 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తాం.

Updated Date - 2021-05-02T05:55:09+05:30 IST