16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-01-13T03:48:54+05:30 IST

16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభం: ఎమ్మెల్యే

16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభం: ఎమ్మెల్యే
సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

వరంగల్‌ రూరల్‌, జనవరి 12 : నర్సంపేట ప్రభుత్వాస్పత్రితోపాటు డివిజన్‌లోని తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈనెల 16నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని క్యాంప్‌ కార్యాలయంలో మెడికల్‌, రెవెన్యూ, పోలీసు, మునిసిపాలిటీ, విద్యుత్‌ అధికారులతో మంగళవారం రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. మొదటి దశలో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న 1,806 మంది ప్రభుత్వ, ప్రైవే టు మెడికల్‌, పారా మెడికల్‌ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పవన్‌కుమార్‌, ప్రభుత్వాస్పత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ గోపాల్‌, మునిసిపల్‌ కమిషనర్‌ విద్యాదర్‌, టౌన్‌ సీఐ కరుణసాగర్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ గుంటి రజని తదితరులు పాల్గొన్నారు. అలాగే ద్వారకపేట పాఠశాలలో వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి భూపేష్‌, మండల ఆరోగ్యవిస్తరణ అధికారి సంజీవరావు, అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-13T03:48:54+05:30 IST