తాడో పేడో తెల్చుకుంటామని వెళ్లి తోక ముడిచారు: వీహెచ్

ABN , First Publish Date - 2021-12-08T23:00:32+05:30 IST

టీఆరెఎస్ ఎంపీలు పార్లమెంట్లో తాడో పేడో తెల్చుకుంటామని వెళ్లి తోక ముడిచారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు విమర్శించారు.

తాడో పేడో తెల్చుకుంటామని వెళ్లి తోక ముడిచారు: వీహెచ్

హైదరాబాద్: టీఆరెఎస్ ఎంపీలు పార్లమెంట్లో తాడో పేడో తెల్చుకుంటామని వెళ్లి తోక ముడిచారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు విమర్శించారు. టీఆరెఎస్ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లి ఏం సాధించుకునీ వచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీలు జిల్లాల్లో తిరుగుతామని చెప్పడం సిగ్గుచేటన్నారు. జిల్లాల్లో వచ్చే టీఆర్ఎస్ ఎంపీలను ప్రజలు నిలదీయాలన్నారు. టీఆరెఎస్, బీజేపీలు రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. పండిన ప్రతి గింజా కొంటామని కేసీఆర్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు కేంద్రంపై తప్పు చూపి తప్పించుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-08T23:00:32+05:30 IST