కౌశిక్‌ ఆరోపణల్ని ఖండించిన ఉత్తమ్

ABN , First Publish Date - 2021-07-13T03:12:58+05:30 IST

కౌశిక్‌ ఆరోపణల్ని ఖండించిన ఉత్తమ్

కౌశిక్‌ ఆరోపణల్ని ఖండించిన ఉత్తమ్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి‌, ఠాగూర్‌పై కౌశిక్‌ ఆరోపణల్ని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఖండించారు. 2018లో హుజురాబాద్ కాంగ్రెస్‌ టికెట్ రావడం వల్లే కౌశిక్‌రెడ్డి లీడర్ అయ్యాడని గుర్తుచేశారు. పార్టీలోని ఇతర నేతల్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇవి టీఆర్ఎస్ నాయకులు చేయిస్తున్న ఆరోపణలని ఆరోపించారు. కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. కౌశిక్‌రెడ్డి స్థాయి మరిచిపోయి ఇష్టానుసారం మాట్లాడారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కౌశిక్ అలా మాట్లాడారని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

Updated Date - 2021-07-13T03:12:58+05:30 IST