అరుణ, రవీందర్‌రెడ్డి నియామకంపై సంఘాల హర్షం
ABN , First Publish Date - 2021-05-20T07:32:57+05:30 IST
(టీఎస్పీఎస్సీ) సభ్యులుగా ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు నియామకం కావడం పట్ల పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): (టీఎస్పీఎస్సీ) సభ్యులుగా ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు నియామకం కావడం పట్ల పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారి, పూర్వ డిప్యూటీ తహసీల్దార్, టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిని సభ్యులుగా నియమించినందుకు తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.చంద్రమోహన్, డి.శ్రీనివా్‌సరెడ్డి, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్‌లు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కారం రవీందర్‌రెడ్డి నియామకం పట్ల సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, ఆర్.ప్రతాప్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. కాగా, టీఎ్‌సపీఎస్సీ సభ్యుడిగా నియమించినందుకు కారం రవీందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఙతలు తెలిపారు. తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.