డీఆర్‌డీవో ఆర్‌సీఐ డైరెక్టర్‌గా ఉమ్మలనేని రాజాబాబు

ABN , First Publish Date - 2021-08-21T08:24:34+05:30 IST

రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లోని ఇమారత్‌ పరిశోధన కేంద్రం(ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు.

డీఆర్‌డీవో ఆర్‌సీఐ డైరెక్టర్‌గా ఉమ్మలనేని రాజాబాబు

అల్వాల్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లోని ఇమారత్‌ పరిశోధన కేంద్రం(ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ ప్రాంగణంలో ఏపీజీ అబ్దుల్‌ కలాం క్షిపణి కాంప్లెక్స్‌లో ఆర్‌సీఐ ఉంది. ఇదే విభాగంలో ఆయన ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ సామర్థ్యాల్లో రూపకల్పన, అభివృద్ధి, విజయవంతంగా ప్రయోగాల వెనుక ఆయన కృషి ఉన్నట్లు డీఆర్‌డీఓ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో తొలి యాంటీ-శాటిలైట్‌ క్షిపణి పరీక్ష ‘మిషన్‌ శక్తి’ ఆయన నేతృత్వంలోనే జరగడం విశేషం.

Updated Date - 2021-08-21T08:24:34+05:30 IST