క్యాన్సర్ రోగుల కోసం జుట్టు దానం చేసిన చిన్నారులు

ABN , First Publish Date - 2021-10-20T03:21:03+05:30 IST

పదేళ్లు కూడా లేని పసిమనసుల ఆలోచన ఆదర్శంగా ఆచరణీయంగా నిలిచింది. సుభా పోలె (10), ఆరోహి పోలె (7) అనే ఇద్దరు చిన్నారులు క్యాన్సర్ రోగుల కోసం తమ వెంట్రుకలు దానం చేశారు. సంఘమిత్ర సొసౌటి-ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్, ఎంపవర్‌మెంట్ అండ్ అవేర్‌నెస్ అనే ఎన్‌జీవో సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులు తమ వెంట్రుకలను దానం చేశారు..

క్యాన్సర్ రోగుల కోసం జుట్టు దానం చేసిన చిన్నారులు

హైదరాబాద్: పదేళ్లు కూడా లేని పసిమనసుల ఆలోచన ఆదర్శంగా నిలిచింది. సుభా పోలె (10), ఆరోహి పోలె (7) అనే ఇద్దరు చిన్నారులు క్యాన్సర్ రోగుల కోసం తమ వెంట్రుకలు దానం చేశారు. సంఘమిత్ర సొసౌటి-ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్, ఎంపవర్‌మెంట్ అండ్ అవేర్‌నెస్ అనే ఎన్‌జీవో సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులు తమ వెంట్రుకలను దానం చేశారు. కీమోథెరఫీ ప్రభావంతో జుట్టు కోల్పోతున్న క్యాన్సర్ రోగులకు ఇవి అందించాలని సదరు ఎన్‌జీవోను చిన్నారులు కోరారు. సంఘమిత్ర సొసౌటి-ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్, ఎంపవర్‌మెంట్ అండ్ అవేర్‌నెస్ అనే ఎన్‌జీవో జనరల్ సెక్రెటరీ క్రాంతి కుమార్ పోలె, కోఆర్టీనేటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్డీకపూల్‌లోని ఆంకాలజీ హాస్పిటల్‌ వేదికైంది.

Updated Date - 2021-10-20T03:21:03+05:30 IST