స్వేచ్ఛ పేరుతో విశ్వాసాన్నిదెబ్బతీయొద్దు: ఐజేయూ,టీయూడబ్ల్యూజే

ABN , First Publish Date - 2021-12-26T22:19:36+05:30 IST

మీడియా స్వేచ్ఛ దుర్వినియోగం ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి,

స్వేచ్ఛ పేరుతో విశ్వాసాన్నిదెబ్బతీయొద్దు: ఐజేయూ,టీయూడబ్ల్యూజే

హైదరాబాద్: మీడియా స్వేచ్ఛ దుర్వినియోగం ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే.విరాహత్ అలీలు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు.


ప్రజా ప్రయోజనాల వార్తల వెల్లడికి ఎలాంటి సాహసాలకైనా పూనుకోవచ్చని,అయితే ఆ ముసుగులో జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం వృత్తి ధర్మాన్ని అపహాస్యం చేస్తుందని ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై ఓ యూట్యూబ్ ఛానెల్ లో తీన్మార్ మల్లన్న వాడిన భాషా, వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని వారు ఖండించారు.ఓ రాజకీయ పార్టీ విశ్వాసాల్ని పవిత్రమైన జర్నలిజానికి జతకట్టడం సహించరాని అనైతికమని వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-26T22:19:36+05:30 IST