తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించలేదు: టీటీడీ

ABN , First Publish Date - 2021-07-12T08:15:27+05:30 IST

‘తిరుమలలో తమ సిఫార్సు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏ విధంగా దర్శన టికెట్ల కేటాయింపు

తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించలేదు: టీటీడీ

తిరుమల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ‘తిరుమలలో తమ సిఫార్సు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏ విధంగా దర్శన టికెట్ల కేటాయింపు జరిగేదో ఇప్పుడూ అదే అమలు జరుగుతోంది’ అని టీటీడీ ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. తిరుమలలోని జేఈవో కార్యాలయం వద్ద రెండు రోజుల క్రితం కొందరు నిరసనకు దిగిన నేపథ్యంలో టీటీడీ స్పందించింది. ‘గతవారం కొందరు ప్రజాప్రతినిధులు వారి కోటాకు మించి లేఖలు ఇచ్చారు. వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయం తక్కువగా ఉండటంతో పాటు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు సిపార్సు లేఖలు రావడంతో కోటాకు మించి వచ్చిన లేఖలను తిరస్కరించాం. అయినప్పటికీ కొందరు ఫోన్‌ చేసి తమకు ముఖ్యమైన వారిని చెప్పడంతో ఆ లేఖలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మంజూరు చేసి శ్రీవారి దర్శనం చేయించాం. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు వ్యక్తులు అవాస్తవ ఆరోపణలు చేయడంతగదు’ అని పేర్కొంది.

Updated Date - 2021-07-12T08:15:27+05:30 IST