ఉపాధ్యాయుల కేటాయింపుల్లో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-20T05:03:54+05:30 IST

ఉపాధ్యాయుల కేటాయింపుల్లో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి

ఉపాధ్యాయుల కేటాయింపుల్లో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి

టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సోమశేఖర్‌

మంగపేట, డిసెంబరు 19: విభజన ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఉపాధ్యాయుల కేటాయింపుల్లో నూతన జిల్లాల స్థానికతను పరిగణ నలోకి తీసుకో కపోవడం దారుణమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా ఫెడరేషన్‌ (టీఎ్‌సయూటీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సోమశేఖర్‌ అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో  ఆదివారం నిర్వహించిన ఆ సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ఏరియాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఏజెన్సీలోనే కొనసాగించాలని, ఏజెన్సీయేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంత జిల్లాలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సర్వీసు రూల్స్‌ ప్రకటించి పదోన్నతులు ఇవ్వాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గొప్ప సమ్మారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కిరణ్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.వాసుదేవరెడ్డి, ఎం. అరుణ, జిల్లా కోశాధికారి పి.సమ్మయ్య, జిల్లా కార్యదర్శులు కొండ చెంచయ్య, ఎం.వెంకటస్వామి, జి.వి.సత్యనారాయణ, ఎస్‌.పాపారావు, జి. భాస్కర్‌రావు, కె. రఘురాం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-20T05:03:54+05:30 IST