అప్పుల బాధతో రైతు బలవన్మరణం

ABN , First Publish Date - 2021-10-20T08:53:23+05:30 IST

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

అప్పుల బాధతో రైతు బలవన్మరణం


తిరుమలగిరి(సాగర్‌), అక్టోబరు 19: అప్పుల బాధతో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం నాయకునితండాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తండాకు చెందిన మేరావత్‌ గుండు(35) ఏడెకరాల్లో పత్తి సాగు చేశాడు. గత ఏడాది దిగుబడి రాకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన రూ. 8లక్షలు అప్పులు మిగిలిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ఏడాది పంట కూడా దెబ్బతింది. దీంతో అప్పులెలా తీర్చాలనే బెంగతో ఈ నెల 14న పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుప్రతికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు.  

Updated Date - 2021-10-20T08:53:23+05:30 IST