టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా సమ్మారావు

ABN , First Publish Date - 2021-01-14T04:02:18+05:30 IST

టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా సమ్మారావు

టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా సమ్మారావు
రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సమ్మారావు

ములుగు కలెక్టరేట్‌, జనవరి 13: టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా అధ్యక్షుడు గొప్ప సమ్మారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభ జరిగింది. రాష్ట్ర కార్యదర్శిగా సమ్మారావుతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులుగా దూపటి కిరణ్‌కుమార్‌, రెడ్డి వాసుదేవరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ వికాసం, ఉపాధ్యాయుల సంక్షేమానికి రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తమ ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-01-14T04:02:18+05:30 IST