డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు: ఎస్‌ఈసీ
ABN , First Publish Date - 2021-10-29T23:41:29+05:30 IST
రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల

హైదరాబాద్: రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. తమకు డబ్బులు రాలేదని నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలో కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. డబ్బుల కోసం ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. ఓటు కోసం డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామని శశాంక్ తెలిపారు. డబ్బులు అడిగినట్లు తేలితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఎస్‌ఈసీ శశంక్ పేర్కొన్నారు.