రెండు బైకులు ఢీ.. ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2021-12-26T08:31:23+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఓ మహిళ..

రెండు బైకులు ఢీ.. ముగ్గురు మృతి

ఉట్నూర్‌, డిసెంబరు 25: ఆదిలాబాద్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఓ మహిళ.. ప్రాణాలతో పోరాడుతున్నారు. నార్నూర్‌ మండలం తడిహత్నూర్‌కు చెందిన స్నేహితులు సుష్విన్‌(21), భవేష్‌(20).. ఇంద్రవెల్లి వైపు నుంచి ఉట్నూర్‌ ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఉట్నూర్‌ మండలం పెర్కగూడకు చెందిన దుర్గం రాజేశ్‌(22), భార్య రజనితో బైక్‌పై ఇంద్రవెల్లి వైపు వెళ్తున్నారు. ఎంద, కుమ్మరితండాల మధ్య వారి వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొట్టుకొన్నాయి. ఘటనా స్థలంలో సుష్విన్‌, భవేష్‌, రాజేశ్‌ మృతి చెందారు. రాజేశ్‌ భార్య రజని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-12-26T08:31:23+05:30 IST