ఉస్మానియా ఆస్పత్రిలో ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-25T21:01:42+05:30 IST

నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. డెర్మటాలజి డిపార్ట్మెంట్ లో డ్యూటీ డాక్టర్ భువన శ్రీ పై ఫ్యాన్ ఊడి పడింది.

ఉస్మానియా ఆస్పత్రిలో ప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. డెర్మటాలజి డిపార్ట్మెంట్ లో డ్యూటీ డాక్టర్ భువన శ్రీ పై ఫ్యాన్ ఊడి పడింది. ఓపీలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్‌కు తలకు గాయమైంది. ఈ ఘటనతో అక్కడ వున్న పెషెంట్‌లు ఉలిక్కిపడ్డారు. ఫ్యాను ఊడి పడిపోవడంతో అక్కడి వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాగైతే ఈ క్షణంలో ఏమైతుందోనని పెషెంట్‌లు, పెషెంట్ కుటుంబ సభ్యులు భయపడిపోతున్నారు. 

Updated Date - 2021-10-25T21:01:42+05:30 IST