‘భవన్’లో తెలంగాణవారికి చోటేదీ?
ABN , First Publish Date - 2021-07-24T07:55:12+05:30 IST
తెలంగాణ భవన్‌లో తెలంగాణవారికే ఉద్యోగాలు ఇవ్వాలని ఢిల్లీలోని పలు వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఢిల్లీ తెలుగు విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వివేక్ రెడ్డి నేతృత్వంలో శు

తెలంగాణ భవన్ ముందు విద్యార్థుల ధర్నా
న్యూఢిల్లీ, జూలై 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణ భవన్‌లో తెలంగాణవారికే ఉద్యోగాలు ఇవ్వాలని ఢిల్లీలోని పలు వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఢిల్లీ తెలుగు విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వివేక్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం భవన్ ముందు ఆందోళన చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో రెసిడెంట్ కమిషనర్ వివక్ష చూపిస్తున్నారని, తెలంగాణ భవన్‌ను ఉత్తరాది భవన్‌గా మార్చారని విమర్శించారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు.