వడ్లు కొనకుండా రైతు మీద సర్కారు పగబట్టింది: షర్మిల
ABN , First Publish Date - 2021-11-27T02:13:23+05:30 IST
వడ్లు కొనకుండా రైతు మీద సర్కారు పగబట్టిందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

హైదరాబాద్: వడ్లు కొనకుండా రైతు మీద సర్కారు పగబట్టిందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొంటారో కొనరో తెలియక రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవడు చస్తే నాకేంటని సర్కారు చేతులెత్తేసిందని తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ ధాన్యం కొనక రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతన్నలు చేతకాని సర్కార్ తీరుకు పంటను తగలబెడుతున్నారని తెలిపారు. దొరా.. నువ్వు వడ్లు కొనకపోతే నీ కాలర్ పట్టుడు పక్కా... నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా అని షర్మిల హెచ్చరించారు.