కొత్త కిక్కు

ABN , First Publish Date - 2021-11-12T05:54:40+05:30 IST

కొత్త కిక్కు

కొత్త కిక్కు

 వ్యాపారులను ఆకర్షించేలా  నూతన మద్యం పాలసీ

 దరఖాస్తులకు పరిమితుల్లేవ్‌..

 ఒకరు ఎన్నయినా దాఖలు చేయొచ్చు

 భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొత్తగా ఏడు షాపులు

 ఎస్సీ, ఎస్టీ, గౌడ్స్‌కు డ్రా పద్ధతిన రిజర్వేషన్లు  

 ఎస్సీలకు-7, ఎస్టీలకు -11,  గౌడ్స్‌కు -9 దుకాణాల కేటాయింపు

 20వ తేదీన ఎంపికలు


(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

కొత్త మద్యం పాలసీ వ్యాపారులకు కిక్కునిస్తోంది. ఎక్సైజ్‌ శాఖకు మరింత ఆదాయం సమకూర్చనుంది. ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల గడువు ఈ నెల ఖారుతో ముగియనుండటంతో కొత్త టెండర్లు నిర్వ హించేందుకు ‘ఆబ్కారీ’ కసరత్తు చేస్తోంది. ఈసారి వ్యాపారులకు మరిన్ని సడలింపులు లభించనున్నారు. ఒకరు ఇక ఎన్ని దరఖాస్తులైన చేసుకోవచ్చు. మరో వైపు మద్యం షాపుల నిర్వహణకు ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు 30 శాతం రిజర్వేషన్లు కూడా ఖరార య్యాయి. వీటి ప్రకారం ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా మరిన్ని మద్యం షాపులను ఎక్సైజ్‌ శాఖ ఏర్పాటు చేస్తోంది. దీంతో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొత్తగా ఏడు షాపులు ఏర్పాట వుతున్నాయి.

ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం పాలసీ (2019-21) ఈనెలాఖరులోగా ముగియనుంది. కొత్త పాలసీ (2021-23) డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. కొత్త విధి విధానాలను అధికారులు విడుదల చేసింది. ప్రస్తుత పాలసీ ప్రకారం అక్టోబరు 31 వరకే ఉండగా  మద్యం షాపులకు గడువు ఉండగా కరోనా నేపథ్యంలో ప్రభు త్వం ఈనెలఖారు వరకు పెంచింది. డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే కొత్త పాలసీ ప్రకారం వ్యాపారులను ఆకర్షించేందుకు ఎక్సైజ్‌ శాఖ పలు మార్పు చేర్పులు చేసింది. గతంలో ఒక వ్యక్తి ఒక దరఖాస్తు మాత్రమే చేయాల్సి ఉండగా ఈసారి ఎన్నయినా చేసుకునేం దుకు అవకాశం కల్పించింది. డ్రా సమయంలో దరఖా స్తుదారుడు తప్పనిసరిగా ఉండాలనే  నిబంధనను కూడా ఈసారి సడలించింది.. రూ. 2లక్షల రుసుం మాత్రం ఎప్పటిలాగే దరఖాస్తుతో పాటు ఈసారి కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఇందులో కొంత మార్పులు చేశారు. దరఖాస్తుతోపాటు వ్యాపా రులు కట్టిన డబ్బులు ఇక తిరిగి ఇవ్వరు. 

అదనంగా ఏడు దుకాణాలు 

ఆదాయాన్ని మరింతగా పెంచుకోవడంపై ఆబ్కారీ శాఖ దృష్టిపెట్టింది. ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతా ల్లో కొత్త షాపులను కేటాయిస్తోంది. భూపాలపల్లి, ము లుగు జిల్లాల్లో ఇప్పటికే 53 షాపులు ఉండగా భూపా లపల్లి, ములుగు జిల్లాల్లో అదనంగా ఏడు దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో భాగంగా భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగేలో నూతనంగా మ ద్యం షాపు ఏర్పాటవుతోంది. టేకుమట్ల మండలం వెలిశాల, రేగొండ మండలం గోరి కొత్తపల్లి, భూపాలప ల్లి మండలం గొర్లవీడు, మహముత్తారం మండలం బోర్లగూడెం గ్రామాల్లో నూతనంగా మద్యం షాపులకు ఎక్సైజ్‌ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  ములుగు జిల్లా తా డ్వాయి మండలం మేడారం, ఏటూరునాగారం మండ లం రాంపూర్‌లో కొత్తగా మద్య షాపులను ఏర్పాటు చేసింది. దీంతో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొ త్తం మద్యం షాపుల సంఖ్య 60కి చేరింది.      

తొలిసారిగా రిజర్వేషన్లు..

తొలిసారిగా మద్యం షాపులకు ప్రభుత్వం రిజర్వేష న్లు ఖరారు చేసింది.  భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 60  షాపులు ఉండగా, ఏజెన్సీలోని 11 దుకాణాలను వారికే కేటాయించింది. మిగిలిన 49 షాపుల్లో ఎస్సీలకు 10శాతం, గౌడ్స్‌కు 15శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీంతో భూపాలపల్లి జిల్లాలో ఎస్సీలకు చిట్యా ల మండలం చల్లగరిగే, మల్హర్‌ మండలం తాటిచర్ల, ములుగు జిల్లాలో ములుగు (షాపు నం2), వెంకటా పూర్‌ మండలం లక్ష్మీదేవిపేట, ఏటూరునాగారంలో 1, 3 నంబరు షాపులు, ఏటూరునాగారం మండలం రాం పూర్‌ మద్యం షాపులు రిజర్వు అయ్యాయి. అలాగే గౌడ కులస్థులకు భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఒకటో నంబరు షాపు, రేగొండ మండలం గోరికొత్తపల్లి మద్యం షాపుతో పాటు కాటారం మం డల కేంద్రంలోని ఒకటో నంబరు షాపు, గణపురం మండలం చెల్పూరులో ఉన్న రెండు షాపులు కూడా గౌడ కులస్థులకు రిజర్వు అయ్యాయి. అలాగే గణపురం మండల కేంద్రంలోని ఒకటో నంబరు షాపుతో పాటు ములుగు జిల్లా కేంద్రంలోని ఒకటో నంబరు మద్యం షాపు కూడా గౌడ కులస్థులకు రిజర్వు అయింది. వెంకటాపూర్‌తో పాటు ఏటూరునాగారం రెండో నం బరు షాపు కూడా గౌడ కులస్థులకు రిజర్వు చేశారు. అలాగే ఏజెన్సీ ఏరియాలోని పస్రా, చల్వాయి, గోవింద రావుపేట, తాడ్వాయి, మేడారం, మంగపేట మండలం తిమ్మంపేట, రామచంద్రునిపేట, వెంకటాపురం మండ లం చొక్కాల, వెంకటాపురం, వాజేడు మండలం వాజే డు, లక్ష్మీపురం గ్రామాల్లోని 11 మద్యం షాపులు ఎస్టీల కు రిజర్వు చేశారు. మొత్తం 27 షాపులు రిజర్వేషన్‌ కోటాలో పోగా మిగిలిన 33 షాపులు జనరల్‌ కోటాగా ఉన్నాయి. ఇకభూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏడు షాపులతో పాటు కొత్తగా ఏర్పడిన గొర్లవీడు మద్యం షాపు కూడా జనరల్‌ కేటగిరీలోనే ఉన్నాయి.  

20న మద్యం షాపుల కేటాయింపులు

నూతన పాలసీ (2021-23) ప్రకారం మద్యం షాపు ల టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం వేగం చేసింది. డిసెం బరు 1 నుంచి కొత్త షాపులు తెరిచేందుకు కసరత్తు మొదలు పెట్టింది. టెండర్లను స్వీకరించేందుకు ప్రభు త్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మద్యం షాపుల కేటా యింపులకు ఈనెల 20న డ్రా నిర్వహించనున్నారు. టెం డర్ల స్వీకరణ 18వ తేదీ వరకు కొనసాగనుంది.  అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

రిజర్వేషన్లు ఇలా...

- గౌడ కులస్థులకు (09): రేగోండ-1, గోరికొత్తపల్లి, కాటారం-1, గణపురం-1, చెల్పూరు-1. చెల్పూరు-2, వెంకటపూర్‌, ములుగు-1, ఏటూరునాగారం-2

- ఎస్సీలకు రిజర్వు (07): చల్లిగరిగే(చిట్యాల), లక్ష్మీదేవిపేట (వెంకటాపూర్‌), ములుగు-3, ఏటూరు నాగారం-1, ఏటూరునాగారం-3, రాంనగర్‌ (ఏటూరు నాగారం)

-ఎస్టీల రిజర్వు(11): గోవిందరావుపేట మండలం పస్రా, చల్వాయి, గోవిందరావుపేట, తాడ్వాయి మండ లం మేడారం, తాడ్వాయి, మంగపేట మండలం తిమ్మంపేట, రామచంద్రునిపేట, వెంకటాపురం మండ లం చొక్కాల, వెంకటాపురం, వాజేడు మండలం వాజేడు, లక్ష్మీపురం మద్యం షాపులు.


Updated Date - 2021-11-12T05:54:40+05:30 IST