హుజురాబాద్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: ఎస్‌ఈసీ

ABN , First Publish Date - 2021-10-29T23:34:36+05:30 IST

రాష్ట్రంలో జరుగుతున్న హుజురాబాద్ ఉపఎన్నికకు ఏర్పాట్లు

హుజురాబాద్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: ఎస్‌ఈసీ

హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న హుజురాబాద్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసామని రాష్ట్ర ఎస్‌ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు పోలింగ్ కేంద్రాలకు చేరాయన్నారు. అంధుల ఓటర్ల కోసం బ్రెయిలీ ఈవీఎంలు సిద్ధం చేశామని శశాంక్ తెలిపారు. ఉప ఎన్నిక విధుల్లో 32 మంది మైక్రో అబ్జర్వర్లు, 3,868 మంది పోలీసుల బందోబస్తులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసామన్నారు. కొవిడ్ నిబంధనలతో  అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. ఓటర్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. ఉప ఎన్నికలో 3.5 కోట్ల నగదు పట్టుకున్నామని శశాంక్ గోయల్ తెలిపారు. 

Updated Date - 2021-10-29T23:34:36+05:30 IST