బీజేపీ నేతలకు మతి చెడింది: శ్రీధర్ రెడ్డి
ABN , First Publish Date - 2021-11-22T03:19:04+05:30 IST
సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేత చంద్రశేఖర్ దేశద్రోహి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. రైతు ఉద్యమంలో ...

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేత చంద్రశేఖర్ దేశద్రోహి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తే దేశద్రోహి అవుతారా? ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలకు మతి చెడిందని, రైతు ఉద్యమంలో ఉన్నవారు ఖలిస్థాన్ తీవ్రవాదులైతే ప్రధాని రైతు చట్టాలను ఎందుకు రద్దు చేశారని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.