అనిల్‌ను కలవలేదు

ABN , First Publish Date - 2021-08-10T08:07:01+05:30 IST

తాను లోటస్‌ పాండ్‌ దగ్గర బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ను కలిసినట్లుగా సోషల్‌ మీడియా, మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. గతంలో ఓ

అనిల్‌ను కలవలేదు

పాత ఫొటోను వైరల్‌ చేశారు

జీవిత కాలం టీఆర్‌ఎస్‌లోనే : రాజయ్య


హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తాను లోటస్‌ పాండ్‌ దగ్గర బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ను కలిసినట్లుగా సోషల్‌ మీడియా, మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. గతంలో ఓ క్రైస్తవ సమావేశంలో అనిల్‌ను కలిసిన ఫొటోను వైరల్‌ చేస్తున్నారని చెప్పారు. తాను షర్మిలనూ కలవలేదని, అలాంటి అవసరమూ తనకు రాలేదన్నారు. తన జీవిత కాలం టీఆర్‌ఎ్‌సలోనే ఉంటానంటూ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎ్‌సలో సీఎం కేసీఆర్‌ తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, డిప్యూటీ సీఎం హోదాను కల్పించి తనకిష్టమైన వైద్య, ఆరోగ్య శాఖనూ ఇచ్చారన్నారు.


తాను రాజకీయ ఓనమాలు దిద్దింది కాంగ్రె్‌సలోనైనా.. ఎదుగుదల మాత్రం టీఆర్‌ఎస్‌ వల్లనేనని చెప్పారు. దళిత బంధుపై పథకంపైన ఎలాంటి అనుమానాలూ పెట్టుకోవద్దని, మూడెకరాల భూమి పంపిణీ విజయవంతం కాలేదనే దళిత సాధికారత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని తెలిపారు. తెలంగాణలో బీఎస్పీకి ఆదరణ ఉండదని ఆయన అన్నారు. 

Updated Date - 2021-08-10T08:07:01+05:30 IST